ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / పెనుగొండ సతీష్ : ఖాదీ చొక్కా వేసుకున్నంత మాత్రాన నాయకత్వం వచ్చిందని భావించే రాజకీయ కంత్రికి ప్రజలు ఇక మోసపోరు. పార్టీ ఏదైనా సరే, తనకు అనుకూలంగా మలుచుకోవడమే ఆయన ఏకైక లక్ష్యంగా మారిందనే ఆరోపణలు నియోజకవర్గం అంతటా వినిపిస్తున్నాయి. ఓటు అడగడం తెలియదు, ఓటు వేయమని చెప్పితిరిగి గెలిపించడమూ చేతకాదు. నిల్చుంటే కూర్చోలేడు, కూర్చుంటే నిల్చోలేడు అన్నట్టుగా ఆయన రాజకీయ స్థితిగతులు మారిపోతున్నాయి.పార్టీలు మారడం ఆయనకు పరిపాటి. ఎవరు అధికారంలో ఉంటే వారి పక్కనే చేరి, అదే బలంగా చూపించి ప్రజలను, వ్యాపారులను, అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే ఆయన, వాస్తవానికి అధికారపు నీడలో తన స్వలాభమే చూసుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.తన దగ్గర పని చేసే సొంత డ్రైవర్‌కు జీతం ఇవ్వలేని వ్యక్తి, బెదిరిస్తే భయపడతారని ఎలా అనుకుంటున్నాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టులు, పైరవీలు అనే పేరుతో లక్షల రూపాయలు సంపాదిస్తూ, అదే సమయంలో తన డ్రైవర్‌కు ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్టు నుంచి జీతం ఇప్పించడమేమిటని నిలదీస్తున్నారు. తాను చేస్తే సక్రమం, ఇతరులు చేస్తే అక్రమమా అన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదని విమర్శకులు అంటున్నారు.ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారని, బెదిరింపులతో రాజకీయాలు నడవవని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ఖాదీ చొక్కా వేసుకున్నంత మాత్రాన నిజాయితీ ముద్ర పడదని, పార్టీ మార్పులతో కాదు ప్రజాసేవతోనే నాయకత్వం గుర్తింపు పొందుతుందని నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతోంది. ప్రజలను మభ్యపెట్టే ఇలాంటి రాజకీయ కంత్రి నాటకాలకు త్వరలోనే తెరపడుతుందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది అధికారంలో ఉన్న నాయకుల చెంతకు చేరి సొంత స్వలాభం చూసుకుని సొంత ప్రయోజనాల కోసం ఎన్ని నాటకాలు వేసిన సంగతి రామగుండం నియోజకవర్గం అందరికీ తెలుసు. నువ్వు బెదిరిస్తే భయపడే చరిత్ర ఇక్కడ ఎవరికీ లేదు.. నీ గురించి గానీ నీ చరిత్ర గురించి కానీ తెలిస్తే ప్రజలు ఛీ కొడతారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తులో నీ రాజకీయానికే బాగుంటుందనేది గుర్తు పెట్టుకోవాలని పలువురు సూచిస్తున్నారు. నీ ఉపన్యాస దంపుడు మానుకొని ఇప్పటికైనా సరైన రీతిలో రాజకీయం చేయడం నేర్చుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు.
Admin
Aakanksha News