Saturday, 27 June 2026 09:03:17 PM

యుఏఈలో ఇద్దరు భారతీయులకు మరణశిక్షఅమలు..

Date : 07 March 2025 06:12 AM Views : 468

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసింది. మరణశిక్షకు గురైన వారు కేరళకు చెందిన మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్‌రినాష్ దోషిగా తేలగా, ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్‌కు శిక్ష పడింది. వీరిద్దరికి అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. యూఏఈ జైలులో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం రెండురోజుల క్రితమే వెల్లడైన సంగతి తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :