Friday, 16 January 2026 09:19:32 AM

30 ఏళ్ల జీవనోపాధిపై ఖాద్దర్ మారక....రాత్రివేళ రహస్య కూల్చివేత...

బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి ఎవరు...?

Date : 21 December 2025 11:24 AM Views : 1403

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : అధికారం చేతిలో ఉంది కదా నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఏది పడితే అది చేస్తా అంటే ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను తట్టుకునే పరిస్థితి కూడా ఊహించుకోవాలని పలువురు హితువు పలుకుతున్నారు. ఎటువంటి సంబంధం లేని విషయాల్లో వస్తు బాధితులను బెదిరించాల్సిన అవసరం ఆ ఖాద్దర్ నాయకుడికి ఏం అవసరం అనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి.ఉదయం టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన అధికారులు వచ్చి ముందువైపు 10 ఫీట్లు. వెనుక వైపు 10 ఫీట్లు మాత్రమే తీసివేసి, మిగిలిన భాగాన్ని అలాగే ఉంచి వెళ్లిపోయారని బాధితురాలు జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సమస్య ముగిసిందని బాధిత కుటుంబం భావించింది. కానీ కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన ఓ సదరు నాయకుడు పరిస్థితిని పూర్తిగా మలుపు తిప్పాడు.చెట్టు కిందకు పిలిపించి, “ఇది కొంచెమే ఉంది కదా… మొత్తం తీసేయండి. మీకు ఎమ్మెల్యేఎలాంటి అన్యాయం చేయరు. న్యాయం చేస్తారు. వెనుక వైపు స్థలం ఇస్తారు” అంటూ మాటలు చెప్పాడని బాధితురాలు వాపోయింది. దీనికి ఆమె స్పష్టంగా స్పందిస్తూ, “నాకు ఎలాంటి ప్రత్యామ్నాయ స్థలం అవసరం లేదు. మాది ఎంత వరకు ఉందో అంతే ఇవ్వండి చాలు. నేను ఎమ్మెల్యేకు వ్యతిరేకం కాదు. ఆయన వచ్చాక మాట్లాడుతానని చెప్పిందని తెలిపింది. అంతలోనే ఆ నాయకుడు తన ఫోన్ నుండి ఫోన్ ఫోన్ చేసి ఇదిగో ఎమ్మెల్యేతో మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చాడని బాధితురాలు పేర్కొన్నారు. ఫోన్‌లో మాట్లాడిన అనంతరం అది ఎమ్మెల్యే గొంతు కాదని అనుమానం వ్యక్తం చేయగా, తాను గత 30 సంవత్సరాలుగా ఆ షాపుపైనే జీవనోపాధి పొందుతున్నానని, అవసరమైతే “మా కుటుంబాన్ని చంపి అందులోనే పెట్టండి” అని ఆవేదన వ్యక్తం చేశానని చెప్పింది. ఆ మాటలతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడని తెలిపింది. అనంతరం కొంత సేపటికి మళ్లీ అదే నాయకుడు వచ్చి మళ్లీ ఏమంటావు? అని అడిగాడని నాకు ఉన్న స్థలంలోనే ఉంటాను” అని చెప్పగానే, ఇది రోడ్డుకు అడ్డుగా ఉంది… ఇక్కడ రోడ్డు వస్తుంది.అంటూ హెచ్చరించాడని తెలిపింది. నువ్వెందుకు అడుగుతున్నావ్? నువ్వేమైనా ఆఫీసర్‌వా?” అని ప్రశ్నించగానే, బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చివేతకు పాల్పడ్డాడని ఆరోపించింది.నేను ఏ టైం అయినా దీనిని కూల్చగలను” అంటూ సదరు నాయకుడు బెదిరించాడని, ఆ రాత్రి అంతా షాపు ముందే గడిపిన తరువాత, తెల్లారి వచ్చి చూసే సరికి మొత్తం కూల్చివేసి ఉందని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తన వద్ద అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ, అవన్నీ పట్టించు కోకుండా కూల్చివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలు తీవ్రమైనవి.అసలు కూల్చివేయమని చెప్పే అధికారం ఆ సదరు నాయకుడికి ఎవరు ఇచ్చారు? ఫోన్‌లో మాట్లాడిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఏ అధికారంతో బాధితులను బెదిరింపులకు గురి చేశారు? అధికారం చేతిలో ఉందని, ఏదైనా చేయవచ్చనే అహంకారమేనా ఇది? అధికారం ఉందని రెచ్చిపోతే ఏ సమయంలో ఏదైనా జరగొచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమంగా కూల్చివేతలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో ఓ మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో చితకబాదిన సంఘటనను మరోసారి గుర్తు చేసుకోవాలని ఇలాంటి విషయాల్లో ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తే మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :