ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలను బయటపెట్టారు. తనపై జరుగుతున్న కుట్రలతో విసుగెత్తిపోయానని, ఇకపై బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. కేసీఆర్‌కు లేఖ రాసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. అలాగే, స్పీకర్‌కి అధికారిక ఫార్మాట్‌లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించినట్లు కూడా వెల్లడించారు.కవిత తన ప్రసంగంలో తీవ్ర స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావుపై విరుచుకుపడ్డారు. "హరీష్ రావు డబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ మాత్రమే. నా ఓటమితోనే వాళ్ల కుట్రలు మొదలయ్యాయి. నా కృషి, నా కంట్రిబ్యూషన్ పార్టీకి లెక్కలో పెట్టలేదు. అంతా హరీష్ రావు, సంతోష్ రావుల చుట్టూ తిరిగే రాజకీయంగా మారింది" అంటూ మండిపడ్డారు.తనపై అన్యాయం జరిగిందని, తాను అనుభవించిన బాధను ఒక రోజు వాళ్లు కూడా అనుభవిస్తారనే నమ్మకం ఉందని కవిత అన్నారు. సంతోష్ రావును ఉద్దేశించి "అతడు చెప్పులో రాయి, చెవిలో జోరీ" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, నేరేళ్లలో యువకులను చితకబాదిన ఘటనకు సంతోష్ రావే కారణమని ఆరోపించారు.కవిత ఆవేదనతో మాట్లాడుతూ.. "నా కోసం పోరాడిన ప్రజలను, నన్ను నమ్మిన కార్యకర్తలను నేను ఎప్పటికీ మరిచిపోను. కానీ బీఆర్ఎస్ లో న్యాయం జరగలేదు. నన్ను అణగదొక్కడానికి, అవమానించడానికి ప్రయత్నించారు. నా కుటుంబం, నా తండ్రి ఇచ్చిన విలువలకు తగినట్లు నేను వ్యవహరిస్తాను. ఈ పార్టీ లో కొనసాగడం ఇప్పుడు అసాధ్యం" అని స్పష్టం చేశారు.తన రాజీనామా నిర్ణయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కవిత ఈ వ్యాఖ్యలతోనే తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలకు దారితీసింది.
Admin
Aakanksha News