Saturday, 27 June 2026 10:08:32 PM

నిప్పుల కుప్పటిలా ఓ ఎమ్మెల్యే పై కార్యకర్తల అసంతృప్తి...

నాడు గెలుపులో కీలకంగా ఉన్న నేతలు... ఎమ్మెల్యేకు నేడు దూరంగా...

Date : 13 March 2025 02:18 PM Views : 1344

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఉత్తర తెలంగాణ జిల్లాలో రాజకీయాలకు ఆ నియోజకవర్గం పెట్టిన పేరుగా నిలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇది మరువకముందే మరొకటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వ్యవహారం తెరమీదకు రావడంతో నిప్పుల కుప్పటిలా నియోజకవర్గం తయారైందనే వాదనలు రాజకీయ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని అయినా కూడా ఏ రోజు నియోజకవర్గానికి సంబంధించిన వారు ఎవ్వరు వచ్చిన వారికి సహాయ సహకారాలను అందించానని, ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తిస్థాయిలో నేను ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలను అందించడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని గత ఎన్నికల సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో అధికారంలో ఉన్న ఓ ఎమ్మెల్యే వెంట ఉన్న కొంతమంది నాయకులు ఆ నేత మాటలు నమ్మి ఎన్నికల సమయంలో పార్టీ కండువా కప్పుకుని ఆ నేత గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. అంతటితో ఆగకుండా సదరు నాయకులు గత మాజీ ఎమ్మెల్యే పై ప్రస్తుత ఎమ్మెల్యే కోసం ఎన్నో సార్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కానీ రాను రాను మారుతున్న రాజకీయ పరిణామాలు ఆ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంత మంది నేతలు సదరు ఎమ్మెల్యే పై అసంతృప్తిగా ఉన్నట్లు జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే తనను నమ్మి తన గెలుపు కోసం కృషిచేసిన కొంతమంది నాయకులతో పాటు సొంత పార్టీ నేతలను సదురు ఎమ్మెల్యే బూడిద కాంట్రాక్టు విషయంలో కాంట్రాక్టు టెండర్ వేసుకోమ్మని కార్యకర్తలను, నాయకులను సదురు ఎమ్మెల్యే మొదట ప్రోత్సహించడంతో సంతోషానికి గురైన నాయకులు నిజమే అనుకోని టెండర్లు వేసినట్లు సమాచారం. అయితే చివరకు సొంత పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇవ్వకుండా ఇతర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అటెండర్ కట్టబెట్టడంపై ఒక్కసారిగా సొంత పార్టీ నాయకులు కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. దీంతో మొదటి నుంచి చురుగ్గా పాల్గొన్న కొంతమంది నేతలు ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేకు పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది రాజకీయ బహిరంగ రహస్యంగా ఇక్కడ పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీలోనే సీనియర్, జూనియర్ అంటూ వివాదాలు తలెత్తుతున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యకాలంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను కాదు అని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతనిచ్చి వారికి పదవులు ఇవ్వడం పై పార్టీలో అసంతృప్తి వ్యక్తం అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గ పరిస్థితులపై అధిష్టానం ఎందుకు దృష్టిసారించడం లేదు....?

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో జరుగుతున్న విభేదాలు అసంతృప్తులను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇంచార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీలో చాలా మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయిలో నివేదికను తీసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారంలోనూ సదరు ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రచారాన్ని చేయలేదనే విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంత మెజారిటీ వచ్చింది మెజారిటీ తగ్గడానికి గల కారణాలేంటి అనే విషయాలపై ఆరా తీయాలని పలువురు సొంత పార్టీ నేతలే కోరుకోవడం జోరుగా విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు అధిష్టానాన్ని కలవడానికి కుమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రాను రాను ఈ నియోజకవర్గ పరిస్థితి ఎటువైపు పోతుందో అనే సందేహాలు అందరిలోను వ్యక్తమవుతున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే....

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :