Friday, 16 January 2026 08:14:07 AM

బెదిరింపులతో "ఆకాంక్ష"ను నిశ్శబ్దం చేయగలమని భావిస్తే అది వారి అవివేకానికి నిదర్శనం...

ఎవరి స్వలాభం కోసం పని చేయని పత్రిక "తొలి ఆకాంక్ష "

Date : 23 December 2025 03:38 PM Views : 509

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / పెనుగొండ సతీష్ : "తొలి ఆకాంక్ష" దినపత్రిక ఎవరి స్వలాభం కోసం, ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పత్రిక కాదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రజా సమస్యలను అక్షర రూపంలో తీర్చిదిద్దుతూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే ఆకాంక్ష దినపత్రిక యొక్క ధ్యేయం. ఎవరి తాటాకు చప్పట్లకు భయపడే పరిస్థితి గానీ, అలాంటి వ్యక్తిత్వం గానీ ఆకాంక్షకు లేదు.ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం, తప్పులను ఎండగట్టడం జర్నలిజం యొక్క మూల సూత్రం. ఆ సూత్రాన్ని ఆచరిస్తూనే ఆకాంక్ష దినపత్రిక ముందుకు సాగుతోంది. ఎవ్వరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా, వాటిని న్యాయపరంగా ఎదుర్కొనే ధైర్యం, సిద్ధత ఆకాంక్షకు ఉంది. అక్రమ మార్గాల్లో లక్షల రూపాయలను కూడబెట్టుతూ, తమ వద్ద పనిచేసే వారికి సైతం ఇతర విభాగాల నుంచి జీతాలు ఇప్పిస్తూ స్వలాభాన్ని పెంచుకుంటున్న నాయకుల అసలు గుట్టును ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకురావడానికి తొలి ఆకాంక్ష దినపత్రిక సిద్ధమవుతోంది.మంచి జరిగితే మంచి అని చెప్పడం, చెడు జరిగితే చెడు అని చెప్పడం పత్రిక బాధ్యత. ఆ మాటలు నచ్చకపోతే, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా వ్యక్తులదే. అంతేకాని, జర్నలిస్టులను బెదిరించడం, భయపెట్టాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బెదిరింపులతో ఆకాంక్షను నిశ్శబ్దం చేయగలమని భావిస్తే, అది వారి అవివేకానికి నిదర్శనం మాత్రమే.ఆకాంక్ష దినపత్రిక కేవలం వార్తల రూపంలో వార్తను మాత్రమే అందిస్తుంది. ఎలాంటి వ్యక్తిగత దురుద్దేశాలు లేకుండా, ప్రజలకు నిజాన్ని తెలియజేయడమే మా లక్ష్యం. అక్రమ సంపాదన ఎంత పెద్దదైనా, అధికార బలం ఎంత ఉన్నా, సత్యం ముందు అవి నిలవలేవు. బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ఆకాంక్షకు ఎప్పటికీ లేదు. ఇప్పటికైనా బెదిరింపుల మార్గాన్ని విడిచిపెట్టి, ప్రజల కోసం పనిచేసే దిశగా ఆలోచిస్తే, అదే వారి భవిష్యత్తుకు బంగారు బాటగా మారుతుంది. అధికారమనేది శాశ్వతం కాదు. కానీ జర్నలిజం అనేది జీవితాంతం నిలిచే బాధ్యత. ఈ నిజాన్ని గుర్తు పెట్టుకుంటేనే రాజకీయంగా, సామాజికంగా ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. ఆకాంక్ష దినపత్రిక సత్యానికి, ప్రజల పక్షాన నిలిచే తన పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. ఇది మా స్పష్టమైన మాట.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :