Wednesday, 12 August 2026 06:43:25 PM

నోయిడాలో నకిలీ అంతర్జాతీయ పోలీస్‌ స్టేషన్‌ సంచలనం...

Date : 11 August 2025 06:30 AM Views : 482

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : దేశ రాజధాని ఢిల్లీ శివారులోనే నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన సంఘటన కలకలం రేపింది. నోయిడా ఫేజ్‌–3 ప్రాంతంలో "అంతర్జాతీయ పోలీస్‌ కార్యాలయం", "అంతర్జాతీయ నేర దర్యాప్తు సంస్థ" పేర్లతో కొంతమంది వ్యక్తులు నకిలీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.పోలీసుల చిహ్నాలు, నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ పత్రాలతో వీరు తామే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ సభ్యులమని నటించారు. ఈ క్రమంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, www.intlpscrib.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విరాళాలను సేకరించారు. అంతేకాకుండా, ఆ వెబ్‌సైట్‌లో నకిలీ జాతీయ, అంతర్జాతీయ ధృవీకరణ పత్రాలను కూడా పోస్టు చేశారు.సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు ఆ నకిలీ స్టేషన్‌పై దాడి చేసి, అక్కడి పత్రాలు, నకిలీ ఐడీలు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు.ఇటీవల ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చిన నకిలీ విదేశీ రాయబార కార్యాలయం ఘటనకు పోలికగా, ఈ నకిలీ అంతర్జాతీయ పోలీస్‌ స్టేషన్‌ బయటపడటం స్థానికులలో ఆందోళన కలిగించింది. పోలీసుల వేషధారణలోనే మోసగాళ్లు నకిలీ పత్రాలతో డబ్బులు దోచుకోవడం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :