Friday, 05 December 2025 05:22:07 AM

119 నియోజకవర్గాలు@రామగుండం. ఆయన కాలు మోపితే ఎమ్మెల్యే నాట...

అందుతే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే పరిస్థితి...! నాడు దేవుళ్లు అన్న నాయకులే నేడు దయ్యాలయ్యారా...

Date : 05 November 2025 02:43 PM Views : 973

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఆయన ఏ నాయకుడి దగ్గర కాలు మోపితే, ఆయన ఏ నాయకుడి దగ్గర అడుగుపెడితే ఆ నాయకుడు ఎమ్మెల్యేగా గెలుస్తాడట... వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవాలంటే భూత ఆ భూత కల్పన నాయకుడి అడుగు కోసం ఆరాట పడాల్సిందే... ఈయన అడుగు వేస్తే అంత మహత్యం జరిగినప్పుడు ఈయన లేఖ ఆయన కుటుంబ సభ్యులను పోటీలో దిప్పి అడుగు పెట్టొచ్చు కదా... ఇంక్కొక్కరి నాయకుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది... తిరగడానికి గిఫ్ట్ గా వచ్చిన లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ కారు... లగ్జరీ జీవితం ఎలా వచ్చింది... వివరాల్లోకి వెళ్తే...రామగుండం నియోజకవర్గంలో కొంత మంది ఆయా పార్టీలో పనిచేసి ఆయా పార్టీల జెండాలను మోసి ప్రజాప్రతినిధుల మెప్పు పొందటమే కాకుండా వారితో లబ్ధి పొంది చివరికి వారు ఓటమి పాలు కాగానే మరో పార్టీలోకి వెళ్లి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు అనే సామెత మాదిరిగా నాడు అదే పార్టీలో ఉండి వారి జెండా మోసి వారికి వత్తాసు పలికి చివరికి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రస్తుతం ఏదైతే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలో చేరి ఇష్టానుసారంగా నాడు అన్నం పెట్టిన నేతలనే విమర్శిస్తున్న వైనం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఎవరు డబ్బులు ఇస్తే వారే దేవుళ్ల అనే విమర్శలు వినిపిస్తున్నాయి.కొంత మంది ప్రతిపక్ష పార్టీల నుండి అధికార పార్టీలో చేరిన వెంటనే ప్రతిపక్షంలో అనుభవించిన సంగతులు వారు చేసిన మేలులు మరిచిపోయి అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే సామెత మాదిరిగా, అధికార పార్టీలో చేరగానే ఇక కొండంత బలం వచ్చినట్లు గల్లి స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు జిల్లా స్థాయి నాయకుల వరకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను వారికి అన్నం పెట్టిన నేతలను విమర్శించడం ఎంతవరకు సమంజసం అని వారి విజ్ఞతకే వదిలేయాలని పలువురు ప్రజలు భావిస్తున్నారు. కొంత మంది అవకాశం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధి మన్ననలు పొందాలనే సంకల్పంతో మధ్యలో పార్టీలో చేరి సొంత పార్టీ కొంత మంది సీనియర్ నాయకులను సైతం లెక్కచేయకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నాయకులకు విమర్శించడం హాస్యాస్పదంగా మారుతుంది. సొంత పార్టీ వర్గాలే అంతర్గతంగా వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చి మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారని భావిస్తున్న వైనం చూస్తుంటే ఎద్దొచ్చి మరో దాన్ని హెచ్చరించినట్లే అనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు ప్రతిపక్షం నుంచి వచ్చిన బుడుత నాయకులు సైతం ఇక్కడ గల్లాలు ఎగిరేసుకొని తెల్ల బట్టలు వేసుకోగానే బూడిద బంగారంలో కొన్ని డబ్బులు రాగానే ఇక వారికి కొండంత అండ అనే విధంగా ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ ఏ పార్టీలో ఉండి ప్రజలం పొందారో ఆ పార్టీ నాయకున్ని కించపరిచే విధంగా మాట్లాడడం వీడియోలు రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం ఆ నేతకే తెలివాలని పలువురు విమర్శిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న నేతలు ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఇక్కడ దాకరించింది. అలాంటి వారు సైతం మాట్లాడడం ఎంత వరకు సమంజసమో వారికే అర్థం కావాలి వారి విజ్ఞతకే వదిలేస్తున్నామనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.రేపు సదరు నాయకులు ఓడిపోయిన మళ్లీ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఈ నేతల దుస్థితి ఇదేనని ఈ నేతల భవిష్యత్తు బంగారం కావాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలనే సామెతకు వీరు మాత్రం నిలువుటద్దంగా నిలుస్తారనేది అక్షర సత్యం...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :