Saturday, 27 June 2026 10:06:53 PM

మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో విక్రయం....

మెటా సాయం కోరిన యూపీ పోలీసులు

Date : 20 February 2025 05:46 PM Views : 580

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటూ సాగే ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకూ 57 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, అక్కడ సంగమంలో స్నానాలు చేస్తున్న మహిళా భక్తులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసి కొందరు సోషల్‌ మీడియాలో విక్రయిస్తున్న ఉదంతం బయటకు వచ్చింది. దీనిపై యూపీ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.ఈ ఘటనపై ఇప్పటి వరకూ కోత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోలు, ఫొటోలు పోస్టు అయినట్లు గుర్తించారు. ఆ ఇన్‌స్టా ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా మెటా (Meta) సంస్థ నుంచి వివరాలు కోరినట్లు వెల్లడించారు. అంతేకాదు టెలిగ్రామ్‌ ఛానల్‌ CCTV CHANNEL 11లో కూడా ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :