ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఛత్తీస్‌గఢ్ మరోసారి ఎరుపెక్కింది.. సుక్మా జిల్లాలోని గోగుండా కొండపై ఉపంపల్లిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్ బలగాలు, డీఆర్‌జీ పోలీసులు పాల్గొన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
Admin
Aakanksha News