ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఇల్లెందు పట్టణం, మండల పరిధిలోని బాలికల మరియు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లల్లో పనిచేస్తున్న డైలివేజ్ ఔట్‌సోర్సింగ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఇప్పటికే 23 రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మెపై ప్రభుత్వం ఎటువంటి స్పందన చూపకపోవడంతో శనివారం నుండి సమ్మెను తిరిగి ప్రారంభించినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.ఈసందర్భంగా రొంపెడు బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబీ, జేఏసీ నాయకులు లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, రామకళా, మంగలు సంయుక్తంగా ప్రారంభించారు.సమ్మె శిబిరంలో నిర్వహించిన సమావేశంలో అబ్దుల్ నబీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించకుండా, కొత్త మెనూ పేరుతో అదనపు పనిభారం మోపిందని, కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ ఊడిగం పనులు చేయిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు.కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని, వెంటనే టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్వామి, తారబాయ్, నాగేశ్వరరావు, వజ్జ నగేష్, కుమార్ తదితర హాస్టల్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మెను విజయవంతం చేయాలని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేశారు.
Admin
Aakanksha News