Saturday, 27 June 2026 09:02:54 PM

శ్రీ మమత హాస్పిటల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి...

కలెక్టర్ కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం

Date : 29 April 2025 08:42 PM Views : 1674

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసి,వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే కేసు నమోదు చేయించిన గోదావరిఖని శ్రీ మమత హాస్పిటల్ యజమాన్యం,సిబ్బంది తదితరులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకూరి శంకర్, వైద్య ఉద్యోగులు వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 26 వ తేదీన డా. జి. అన్నా ప్రసన్న కుమారి, పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధి నిర్వహాణలో బాగంగా గోదావరిఖని లోని శ్రీ మమత హాస్పిటల్ కు తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించడం జరిగిందన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేరమని తన విధి నిర్వహణ ప్రకారం చర్యలు తీసుకుంటుండగా దానికి అడ్డుపడి, నానా విధాలుగా బెదిరించి ఐఎంఏ డాక్టర్లు ఇతర వ్యక్తులను పిలిపించి విధులకు ఆటంకం కలిగించాలని పేర్కొన్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పై దౌర్జన్యం చేసి, భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా వైద్యాధికారిని చంపి వేస్తామని బెదిరించారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కావున వారి పైన చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యమైన ప్రభుత్వ డాక్టర్ నాగిరెడ్డి అందులో భాగసౌమ్యులైన కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ డాక్టర్ ఆర్.జె. స్వాతి లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే ఈ దౌర్జన్యములో పాల్గొన్న డా. బి. అనిల్ కుమార్ పైన తగు చర్యలు తీసుకుంటూ మెడికల్ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ ను రద్దు చేయడానికి మెడికల్ కౌన్సిల్ బోర్డు కు సిఫారసు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ దౌర్జన్యములో పాల్గొన్న మహాంకాళి స్వామి, అతని అనుచరులు హాస్పిటల్ యజమాన్యం, రిసెప్షనిస్ట్ ఆనంద్ పైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమ కేసు బనాయించిన ఆనంద్ కేసు ఉపసంహరించుకోవలసినదిగా డిమాండ్ చేశారు. దీంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మహిళ అయిన డా. జి. అన్నా ప్రసన్నకుమారికి తగు రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ బి .శ్రీరాములు, డాక్టర్ బి.కిరణ్ కుమార్, వీరగోని శ్రీనివాస్ టి ఎన్ జి ఓ హెల్త్ ఫోరం అధ్యక్షులు, ఉమమహేశ్వర్, టి. జి. ఓ. హెల్త్ ఫోరం అధ్యక్షులు, దేవీ సింగ్, రాష్ట్ర పారా మెడికల్ ఆఫీసర్ ల ఫోరం అధ్యక్షులు, ఆర్ బి ఎస్ కె డాక్టర్లు, కె రమేష్, టి రాజేష్, సాలమ్మ, దాయా మని, ఎన్ హెచ్ ఎమ్ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :