Friday, 16 January 2026 09:26:41 AM

రామగుండం గులాబీ గూటిలో మూడు ముక్కలాట...

రామగుండంలో బీఆర్ఎస్ కు అంతర్గత పోరు బహిర్గతం...

Date : 10 January 2026 09:23 PM Views : 438

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి ప్రతికూల రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రామగుండం లోనూ మూడు వర్గాల నాయకుల మధ్య ఏర్పడిన అసహనం కారణంగా కార్యకర్తలలో అయోమయం, ప్రజలలో అనుమానం ఏర్పడుతోంది. రామగుండంలోని ఈ మూడు వర్గాలు, ఒకే లక్ష్యానికి ప్రత్యేకిస్తూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తున్నప్పటికీ, స్థానిక నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు పార్టీ పట్ల కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు, ఒకరు మరొకరి కార్యక్రమాలకు విరుద్ధంగా ప్రణాళికలు అమలు చేయడం వలన, సాధారణ కార్యకర్తలు ఏ నాయకుడి వర్గంలో పనిచేయాలో అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.గత ఎన్నికల్లో సర్పంచి సీట్లు సాధారణ స్థాయిలోనే లభించగా, రామగుండం లోని స్థానిక నాయకుల అసహనం రానున్న కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి ఆటంకంగా మారింది. సాధారణ కార్యకర్తలు మరియు స్థానిక కార్యకర్తల మద్దతు లేకుండా, ఎన్నికల ప్రచారం బలహీనతకు గురవుతుంది. దీనిపై రేపటి ఆకాంక్షలు ప్రత్యేక కథనం..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :