Thursday, 13 August 2026 07:35:34 PM

అబద్దపు హరిచంద్రులు రామగుండానికి వచ్చారు... మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు...

వీరిద్దరికీ తోడు అమెరికా నుండి ఒక్కడు వచ్చి మీడియా సమావేశాలు పెడుతున్నారు..

Date : 15 September 2025 11:08 AM Views : 749

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. "అబద్దపు హరిచంద్రులు రామగుండానికి వచ్చారు. వీరిద్దరికీ తోడు అమెరికా నుండి ఒక్కడు వచ్చి మీడియా సమావేశాలు పెడుతున్నారు" అంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ లు అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ....గత 20 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ముందస్తు ప్రణాళికలో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మరో 200 మెగావాట్ల ప్రాజెక్టు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రామగుండాన్ని బొందల గడ్డగా మార్చి విధ్వంసాన్ని సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుండి వచ్చిన వ్యక్తి కోసం ఇద్దరు ఒకటైనట్లు ప్రెస్‌మీట్లు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. "ఎవరి ఇళ్లను కుల్చివేశారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వారిని ఒక్కరిని తీసుకువచ్చి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టించండి" అని సవాలు విసిరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రజలు తన్ని తరిమివేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు కార్మికులకు ₹5,000 బోనస్ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌దేనని గుర్తుచేశారు. అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో రాజ్ ఠాకూర్ చూపించారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.సోమరపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ లు రామగుండం నియోజకవర్గానికి ఏమి చేయలేదు. డబ్బులు తీసుకుని సింగరేణి భూములను లంచాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత కోరుకంటి చందర్ దే" అని విమర్శలు వినిపించాయి.రామగుండం అభివృద్ధి కోసం ఇప్పటివరకు 34 వేల కోట్ల రూపాయలతో వివిధ లక్షణాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, 850 కోట్ల నిధులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెచ్చారని నాయకులు వివరించారు. ప్రజలు "శభాష్ రాజ్ ఠాకూర్" అంటూ మెచ్చుకుంటున్న దృశ్యాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :