Saturday, 27 June 2026 10:07:19 PM

రామగుండంలో అర్ధరాత్రి కూల్చివేతల దౌర్జన్యం...

Date : 22 November 2025 05:01 PM Views : 1095

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం మసీద్ టర్నింగ్ సమీపంలో టీఎస్‌జెన్కో క్వార్టర్స్ విభాగంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము 3 గంటల మధ్యలో, సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ స్థానిక నాయకులు, ఓ ప్రముఖ నేత అనుచరులు, అలాగే ఎమ్మెల్యే పీఏగా పిలవబడే మరో ముఖ్య వ్యక్తి ఆధ్వర్యంలో జెసిబి, పొక్లైన్ యంత్రాలను వినియోగించి క్వార్టర్స్ కూల్చివేత పనులు ప్రారంభించారు. అసలు అర్ధరాత్రి కూల్చివేయమని ఏ అధికారులు వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన అధికారులు ఎందుకు సమయపాలన పాటించలేదు అనే అంశాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాధారణంగా పగటి పూట నిర్వహించాల్సిన కూల్చి వేతలను అర్ధరాత్రి రహస్యంగా చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నామని ఏ వేళలోనైనా ఏ చర్య అయినా తీసుకోవచ్చని భావించడం అధికార దుర్వినియోగమని ప్రజలు ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న నియోజకవర్గంలో ప్రజల విలువలు, చట్టపరమైన ప్రక్రియలు పాటించాలన్న అంశాన్ని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు తిరగబడే రోజు వస్తే పరిస్థితులు మారిపోతాయని విమర్శకులు హెచ్చరించారు. కూల్చి వేతలను ఆపేందుకు వచ్చిన జెన్కో స్థానిక ఎస్ఈ, భద్రతా సిబ్బందిపై కూడా కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. అధికారులు తమ విధి నిర్వహణలో నిలదీయగా, వారి మీద అనుచిత పదజాలం ఉపయోగించి బెదిరింపులకూ పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారం లేని వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై అధికారులు ప్రశ్నించగా, వారి జోక్యాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగినట్లు తెలియవచ్చింది.ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేత వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి, ఎవరి అనుమతితో చర్యలు జరిగాయి, అధికార పద్ధతులు ఎందుకు పాటించలేదు అనే అంశాలపై స్థానిక ప్రజలు వివరణ కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వార్త కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :