Friday, 05 December 2025 04:37:05 AM

నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సమాచారం లేదట... – సీసీ ఫుటేజీలు విడుదల చేయాలని డిమాండ్

మైసమ్మ గుడిలు ఆయన దృష్టిలో చిన్న చిన్న షెడ్లట... గట్లతో గట్లంటది మరి

Date : 08 November 2025 08:32 AM Views : 418

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వారు వాడిన మాటలు కూడా మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో తెలియదు అన్న వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే ఒక నాయకుడు ఓ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయనకు దేవాలయాల విలువ తెలియదా. ? దారి మైసమ్మ గుడులను చిన్న చిన్న షెడ్లుగా పరిగణించడం ఎంత వరకు సమంజసమని..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం తగదని, ఆలయ కమిటీలో ఉన్న నాయకులు ఎలా మాట్లాడాలో తెలియక నిర్లక్ష్యంగా ప్రవర్తించడం దురదృష్టకరమని స్థానికులు విమర్శించారు.ఈఘటనలకు ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూ ఆయన అనుచరులు చెబుతున్నప్పటికీ, ప్రజలు ఆ వివరణను అంగీకరించడం లేదనే ప్రచారం సాగుతుంది.. చిన్న చిన్న రోడ్లమీద ఉన్న గుడులు కూల్చివేశారట, మరి పెద్ద పెద్ద రోడ్లు అంటే వీళ్ల దృష్టిలో ఎలా ఉంటాయో వారికే తెలియాలని ప్రజలు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.అధికారులు ఎమ్మెల్యేకు తెలియకుండానే అత్యుత్సాహంతో కూల్చివేశారంటూ చెప్పడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. విచారణ జరపతామనే మాటలు కాకుండా, నగరంలోని సీసీ కెమెరా ఫుటేజీలను బహిరంగం చేయాలని. అప్పుడు ఎవరు కూల్చివేశారో ప్రజల ముందుకు వస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ఎమ్మెల్యేకు తెలియకపోతే పరిపాలన ఎలా సాగుతుంది?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రజా ప్రతినిధులు నిశ్శబ్దంగా ఉండడం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల కూడా వ్యతిరేక వర్గాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒకవైపు అధికార పార్టీ నాయకులు ఇది ప్రభుత్వ విధానం కాదు అంటుంటే, మరోవైపు ప్రజలు మరి ఆ అధికారులకు ఎవరు అధికారం ఇచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో రామగుండం రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఎవరి ప్రేరణతో జరిగాయో తెలుసుకునే వరకు ఈ వివాదం చల్లారే సూచనలు కనిపించడం లేదని పలువురు నిపుణులు భావిస్తున్నారు. కానీ అన్నిచోట్ల మనకు అనుకూలంగా మారుతాయనేది పొరపాటుగా భావించాలని ఏదో ఒక చోట గుడిల కూల్చివేతకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ బయటపడితే అప్పుడు జరిగే నష్టం పూడ్చలేనిదని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :