ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో అసలు పార్టీ ముఖ్య నేతల కంటే సదురు నాయకుడి పేరు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తుంది.ఆయన వ్యవహార శైలీపై సొంత పార్టీ నాయకుల నుండే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన అండదండాలు చూసుకొని కొంత మంది తన అనుచరుల ఆగడలు మితిమిరిపోతున్నాయానే ప్రచారం జోరుగా సాగుతొంది.గత రెండు రోజుల క్రితం తన అనుచరులు చేసిన బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఎన్టీపీసీలోని ఓ మద్యం దుకాణంకు సదురు బడా నేతకు సంబందించిన 5,గురు నాయకులు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ తమకు తక్కువ ధరకు మద్యం ఇవ్వాలని మేము ఓ బడా నేతకు సంబందించిన నాయకులమని వారితో గొడవకు దిగినట్లు జోరుగా రామగుండం నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలను, నియోజకవర్గ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సింది పోయి మద్యం కోసం మద్యం షాపు ముందు గొడవ పెట్టుకోవడంపై ప్రజలు నవ్వుకునే పరిస్థితిలు దాపరిస్తున్నాయి. సదురు బడా నాయకుడికి సంబంధించి ఓ ఐదుగురు నాయకులు చేసిన వ్యవహారం ఇప్పుడు చర్చనియాంశంగా మారింది..
సొంత పార్టీలోనే ఉంటు సొంత కుంపటి ఎందుకు... ⁉️
ఆయన సొంత పార్టీ నాయకుడే... కానీ ఆయన వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ చూసినా అందరి చూపు తన వైపే ఉండాలనుకునే సదరు నేత తనకంటూ సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పటికే సొంత పార్టీలోనే సొంత కుంపటి పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్య నాయకులు నిరంతరం పరితపిస్తూ అభివృద్దే ద్వేయంగా ముందుకు సాగుతుంటే ఈ బడా నేత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. గతంలో కూడా పార్టీకి సంబంధంలేని వ్యవహారాల్లో తల దూర్చి లేనిపోని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినట్లు సొంత పార్టీ నాయకులు విమర్శించడం కోసమేరుపు. అయితే ఇలా ముందు నుంచే రామగుండం నియోజకవర్గంలో గతంలో ఎంతో మంది ముఖ్య నేతల వద్ద ఉన్న కొంత మంది అనుచరులు తమకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పాటు చేసుకొని చివరకు ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదొక్కటే కాకుండా ఎక్కడికైనా వెళ్తే తమ వాహనాల్లో డీజిల్ కొట్టియాలని కొంత మంది అధికారులకు హుక్కుమ్ జారీ చేయడం... తాను చెప్పినట్లు వినాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటో అర్థం కావడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ముఖ్య నేతకు సమాచారం తెలియడం లేదా.. లేక తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే సదరు బడా నేతకు సంబంధించి హద్దులు దాటుతున్న వారికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
Aakanksha News