Monday, 28 September 2026 11:02:39 PM

అప్పుడు మా ఇళ్ల ముందు నిలబడి ఏడుస్తూ ఓట్లు అడిగినప్పుడు రేకుల ఇండ్లు గుర్తుకు రాలేదా..హనుమాన్ నగర్ కు చెందిన రేడియం శ్రీను ఘాటు వ్యాఖ్యలు...

మామిడి చెట్టు కింద నాయకులు బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలి...

Date : 04 November 2025 09:46 PM Views : 671

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైన ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. మేము అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్లే వినాలి.. అనే ధోరణిలో తమ నాయకులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఏ నాయకుడు కూడా రాజకీయాల్లో రాణించినట్లు చరిత్రలోనే లేదు.. ప్రజల మనసును గెలుచుకునే నాయకులు, చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారనేది చరిత్ర చెప్పిన సత్యం.. ఎవరికి అయిన ఒక్క సమయం, సందర్బం వరకు మాత్రమే ఓపిక ఉంటుంది. అదే ప్రజల ఓపికను పరీక్షిస్తే ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు తిరగబడి నిలదీసే రోజు వస్తుందనేది బహిరంగ రహస్యం. రాజకీయాల్లో ఏమి చేసినా చెల్లుతుంది అనే భావనతో వెళ్లే నాయకులకు ఏదో ఒక రోజు గుణపాఠం తప్పదు, అ గుణపాఠం ఒకడితో మొదలై వందలు వేల సంఖ్యలతో ఒకటయ్యే రోజు వస్తుంది. అనడానికి రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఎక్కడ ఏది జరిగినా ప్రజలు ప్రశ్నించడం లేదని అనుకుంటే మన పొరపాటు జరిగినట్టే అని ఓ వ్యక్తి నిరూపించాడు. ఏకంగా ఎమ్మెల్యేకు అధికారులకు వ్యతిరేకంగా గళం విప్పాడు.. జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించాడు. ఆరోజు ఆ ఒక్కడితో మొదలైన రాజకీయ యుద్ధం... నేడు పదుల సంఖ్యలో అందరూ ఒక్కటిగా మారి ప్రశ్నించే వరకు వచ్చింది అంటే రానున్న రోజుల్లో రామగుండం రాజకీయాల్లో ఇలాగే ప్రశ్నించే రోజులు ఎన్నో వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆరోజు ఆ నాయకులకు ప్రజలు చెమటలు పట్టించే రోజు వస్తుందనేది రాజకీయ సత్యం. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రం మొత్తం రామగుండం వైపే చూసే పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేధింపులు, బెదిరింపులపై గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన రేడియం శ్రీను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత పది నెలలుగా ఎమ్మెల్యే తన అనుచరులను పంపించి తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. హనుమాన్‌నగర్‌లో తన నివాసం వద్ద మీడియాతో రేడియం శ్రీను మాట్లాడుతూ...ఉదయం నుంచి రాత్రి వరకు మా ఇంటి ఎదుటే ఎక్కడో ఉండేవాడు చౌరస్తా కు వచ్చి మామిడి చెట్టు కింద కూర్చుని మమ్మల్ని భయపెడుతున్నారని రాత్రి రాత్రే డోజర్లు పెట్టి ఇళ్లను కూల్చివేస్తాం, మీ శవాలను బయటకు తీసే వారు ఉండరని బెదిరింపులు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే తనకు రేకుల షెడ్ల’ ఇళ్లు కనిపించకూడదని చెప్తున్నారని జీ+1 ఇల్లు కట్టుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు.రేకుల ఇల్లు కనిపించకూడదని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు మా ఇళ్ల ముందు నిలబడి ఏడుస్తూ ఓట్లు అడిగినప్పుడు మీకు రేకుల ఇండ్లు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆడు ముగార్రా బుజ్జి అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ ఇల్లులు కూల్చివేస్తాం. మీ క్వాటర్లను తీసివేస్తాం. రేకుల ఇండ్లు కనిపిస్తే తొక్కి చంపుతా అని చెప్పి ఓటు అడిగినప్పుడు ముగార్రా బుజ్జి అంటారని రేడియం శ్రీను ఘాటుగా స్పందించారు.తమ కుటుంబం 1973 సంవత్సరం నుండి గోదావరిఖని హనుమాన్‌నగర్‌లోనే నివసిస్తోందని, అన్ని రకాల పన్నులు, హౌస్‌టాక్స్‌ సహా ప్రభుత్వ రుసుములు చెల్లిస్తున్నామని రేడియం శ్రీను తెలిపారు. అప్పుడు ఇది జనగామ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. తరువాత నోటిఫైడ్ ఏరియాగా మారి రామగుండం మున్సిపల్‌గా మారింది. అప్పటినుండి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం అని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రాజశేఖరరెడ్డి ఇళ్లకు పట్టాలు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య వాటిని అందజేశారని శ్రీను గుర్తుచేశారు.ఆ పట్టాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా కూల్చేస్తారు? ఏ ఆధారంతో మా ఇళ్లు కూలగొడతారు?” అని ప్రశ్నించారు.ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు అదే ప్రజలను వేధించడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. మా ఇళ్లు కూల్చేస్తామని, క్వార్టర్లను తొలగిస్తామని, రేకుల ఇళ్లు కనిపిస్తే తొక్కి చంపుతామని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.ఇవే మాటలు ఓట్లు అడిగేటప్పుడు చెప్పి ఉంటే ఈ నటన నీ ఏడుపును ఎవరు నమ్మేవారు?కాదు కదా అని రేడియం శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబం, స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు.మా హక్కులను రక్షించండి. మేము చట్టబద్ధంగా ఇక్కడ నివసిస్తున్నాం. ప్రజలతో చేసిన హామీలను ఎమ్మెల్యే మరువకూడదని రేడియం శ్రీను అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :