Wednesday, 12 August 2026 06:36:25 PM

ఓ జాతీయ కార్మిక సంఘం నేతతో ఎమ్మెల్సీ కవిత భేటీ...

– సింగరేణి కార్మిక హక్కుల కోసం పని చేయడానికి తెలంగాణ జాగృతితో మంతనాలు...

Date : 01 August 2025 03:29 PM Views : 662

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ జాతీయ కార్మిక సంఘం ముఖ్యనేత హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను కలుసుకుని సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కుల రక్షణపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ జాగృతి సంస్థతో జాతీయ కార్మిక సంఘం కలిసి పని చేసే అంశంపై దృష్టి సారించారని ఇందులో భాగంగానే కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, కాంట్రాక్ట్ కార్మికుల పునర్నిర్మాణ హక్కులపై చర్చలు జరిగినట్లు సమాచారం.కార్మిక సంఘాలతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే పలు కార్మిక సంఘాల నేతలతో చర్చలను కొనసాగిస్తున్నట్లు జోరుగా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో చర్చ కొనసాగుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :