Sunday, 27 September 2026 09:22:19 PM

పోలీసుల ఎదుట లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు...

Date : 27 May 2025 04:47 PM Views : 745

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ బెటాలియన్‌లో చురుకుగా ఉన్న నలుగురితో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 10 మందిపై కలిపి మొత్తం రూ.38 లక్షల రివార్డు ఉంది.సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు ఆ 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రామ పంచాయతీ పథకం కింద సాధించిన విజయంగా దీన్ని ఎస్పీ పేర్కొన్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :