Wednesday, 23 April 2025 02:08:12 AM

24 మంది దళితుల ఊచకోత కేసులో కోర్టుకీలక తీర్పు..

Date : 19 March 2025 06:17 AM Views : 195

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : దాదాపు 44 ఏళ్ల క్రితం జరిగిన 24 మంది దళితుల ఊచకోత కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురికి మరణశిక్ష పడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది జిల్లా కోర్టు. 1981 నవంబర్ 18న దేహులిలో జరిగిన ఈ ఘోర ఘటనలో మొత్తం 24 మంది దళితులు హత్యకు గురయ్యారు. మరణించిన వారిలో ఆరు నెలల, రెండు సంవత్సరాల వయస్సుకన్న పిల్లలు కూడా ఉన్నారు.ఈ హత్య కేసులో 17 మంది నిందితులుగా ఉన్నారు. అయితే వీరిలో 14 మంది మరణించారు. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన కోర్టు రామ్‌సేవక్ (70), కప్తాన్ సింగ్ (60), రాంపాల్ (60) అనే ముగ్గురు నిందితులను దోషిగా తేల్చి, వారికి మరణశిక్షను విధించింది. ఈ శిక్ష మాత్రమే కాదు, కోర్టు అదనంగా రూ.50,000 జరిమానా కూడా విధించింది.

అసలు ఏం జరిగింది..

1981 నవంబర్ 18న, ఉత్తరప్రదేశ్ దేహులి గ్రామంలో నిందితులు పోలీసు యూనిఫాంలో ఉండగా, దళితులను బందిపోట్లుగా మార్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వీరిలో 17 మంది పోలీసు యూనిఫాంలో ఉన్న వారే పాలుపంచుకున్నారు. దీనిపై న్యాయవాది రోహిత్ శుక్లా మాట్లాడుతూ, ఈ ఘటన ఒక చారిత్రక మరణహోమంలా ఉందని పేర్కొన్నారు. దేహులిలో దళితులు వ్యవసాయ పనులకు సంబంధించిన పనులు చేసుకునే వారు. వారి జీవనం సాదాసీదాగా సాగిపోతుండగా, ఈ ఘటన జరగడం నేరమైన చర్యగా పేర్కొన్నారు.

చివరకు న్యాయం

ఈ ఘటన కేవలం హత్యగా కాకుండా, ఒక సామాజిక హింసగా కూడా నిలిచిందన్నారు న్యాయవాది. నిందితుల మొత్తం 17 మందిలో, 14 మంది ఇప్పటికే మరణించినట్లు తెలిపిన కోర్టు, మిగిలిన ముగ్గురికి మాత్రం మరణశిక్ష విధించారు. ఈ దళిత హత్యా కేసులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా వివిధ కోణాలలో చర్చకు వస్తోంది. దేహులిలో జరిగిన ఈ ఘోర ఘటన తీర్పు ఆలస్యంగా వచ్చినా కూడా చివరకు న్యాయం జరిగిందని పలువురు అంటున్నారు. ఈ కేసులో 1981నాటి హత్యలపై 302 (హత్య), 307 (హత్యాయత్నం), 396 (దోపిడీతో హత్య) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :