Saturday, 27 June 2026 09:05:47 PM

పెద్దపల్లి కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం...

జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడు బొంకూరి శంకర్..

Date : 20 September 2025 08:32 PM Views : 553

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. రామగుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టీఎన్జిఓ చైర్మన్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడు ప్రజా సమస్యలు విద్యా ఉద్యోగాలు యువత భవిష్యత్తు వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని, కలెక్టర్ పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల మనో ధైర్యం దెబ్బ తీయడమేనని అన్నారు.కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలలో విద్యార్థులకు తగిన వసతుల రూపకల్పనకై అన్ని విధాల నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, సీనియర్ సిటిజన్ జాకిట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధులను తల్లిదండ్రులను సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా శ్రమిస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు చేయడం పనిచేసే ఉద్యోగుల మనోభావాలకు తీవ్రమైన భంగం కలుగుతుందని దీనిని జేఏసి పక్షాన ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీర బుచ్చయ్య మాధవి రవీందర్ ప్రభాకర్ వాణిశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :