Friday, 26 June 2026 01:18:35 AM

సీఐ ఇంద్రసేనారెడ్డి మహిళా కార్పొరేటర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు..సీఐపై మహిళ కమిషన్ కు పిర్యాదు చేస్తాం...

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పగానే తెలంగాణ మేయర్ అయిపోయారా... బీఆర్ఎస్ పార్టీ మహిళల కార్పొరేటర్ల ఆగ్రహం..

Date : 19 November 2024 11:43 AM Views : 1840

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మహిళ కార్పొరేటర్లు. నాయకురాళ్ల మీద గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, తమను అవమానపరిచారని వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్లు గాదం విజయ, కవితా సరోజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.... మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేసిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు,కార్పొరేటర్ల మీద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఈ కేసులకు సంబంధించి ఆధార్ కార్డులు అందరూ తీసుకొని రావాలని తెలుపగా ఆధార్ కార్డులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో సీఐ ఇంద్రాసేనా రెడ్డి మీరేమైనా నా పెళ్లికి వచ్చారా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో సీఐపై ఏసీపీకి ఫిర్యాదు చేశామని అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహరించిన తీరుపై హైదరాబాద్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ కార్పొరేటర్లతోనే ఆ విధంగా వ్యవహరించారంటే ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని వారు ప్రశ్నించారు. సీఐ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మెప్పు పొందడం కోసం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వారు అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారు ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో తాము చర్చకు సిద్ధమని. గోదావరిఖని చౌరస్తాకు చర్చకు వస్తారా.. అని సవాల్ విసిరారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే వారికి మాజీ ఎమ్మెల్యే చందర్ ను విమర్శించే హక్కు లేదన్నారు. రామగుండంలో కేవలం కూల్చివేతలే తప్ప అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో చూపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఉన్న మేయర్ రాయలసీమకు చెందిన వారైతే, కాంగ్రెస్ కండువా కప్పగానే తెలంగాణ మేయార్ అయిపోయారా అని ప్రశ్నించారు. మా పార్టీ కండువా ఉన్నప్పుడు రాయలసీమ అయితే కాంగ్రెస్ కండువా వేసుకోగానే తెలంగాణ మేయర్ ఏలా అయిపోయారని వారు ప్రశ్నించారు.ఈ విలేకరుల సమావేశంలో మహిళా కార్పొరేటర్లు, నాయకురాళ్లు కల్వచర్ల కృష్ణవేణి, రాకం లత, అంజలి, సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, గుర్రం పద్మ, స్వప్న తో పాటు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :