ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లాలోని నాలుగో డివిజన్‌లో ఈ సారి మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మెరుగు నరేష్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ తరఫున కౌన్సిలర్ బరిలో నిలవడం రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పదిహేనేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నరేష్, తన కష్టజీవితాన్నే ప్రజలతో పంచుకుంటూ, వారి సమస్యలే తన లక్ష్యమని చెబుతున్నారు.గత పది సంవత్సరాలుగా పెద్దపల్లిలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్న మెరుగు నరేష్, పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటున్నారు.చదువులో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ, ఉద్యోగ పరిమితుల్లోనే కాదు, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకి నమ్మిన కార్యకర్తగా నిరంతరం పనిచేసిన అనుభవమే ఈరోజు ఆయనను అభ్యర్థిగా నిలిపిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నాలుగో డివిజన్‌లో నరేష్‌కు ఉన్న పేరు, ఆయన మంచితనం, అందరితో కలిసిపోయే స్వభావం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడే నరేష్ పేరు డివిజన్ అంతటా వినిపించడం ఆయనకు పెద్ద బలంగా మారింది. ఏ వీధిలో అడుగు పెట్టినా ‘మన నరేష్’ అనే భావన కనిపించడం, ఆయనపై ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.ప్రజా సమస్యల పరిష్కారంలో సామాన్యులకు అండగా నిలబడతానని నరేష్ భరోసా ఇస్తున్నారు. డ్రైనేజీ, తాగునీరు,రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకునే దృఢ సంకల్పం తనదని చెబుతున్నారు. డివిజన్‌లో ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా నీరాజనాలు పలుకుతూ, తమ అభిమానాన్ని తెలియజేయడం ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.ఈ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతం కోసం చివరి వరకు శ్రమిస్తానని మెరుగు నరేష్ స్పష్టం చేస్తున్నారు. పార్టీలోనూ ఆయనకు ఉన్న మంచి పేరు, కార్యకర్తల నమ్మకం ఈ పోటీలో మరింత కలిసొచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిగా, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన మెరుగు నరేష్ ఈ ఎన్నికల్లో ఏస్థాయిలో విజయం సాధిస్తారన్నది ఇప్పుడు పెద్దపల్లి రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Admin
Aakanksha News