ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఆకాంక్ష డెస్క్ : నల్లబంగారం విస్తరించి ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కోల్ బెల్ట్ జిల్లాల్లో అది అత్యంత ఖరీదైన పోలీస్ స్టేషన్ గా పేరు పొందింది , రాష్టంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విభిన్న రకాలుగా నివసించే ఈ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం పేరుగాంచింది, ఇక్కడ ఎంతో మంది అధికారులు ఒక్క సరి అయిన విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఉంటారు. ఇంత పేరు ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ఓ అధికారి వల్ల వివాదాలకు నీలయంగా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో సదురు అధికారి వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకవచ్చే విధంగా వ్యవహరించడం పట్ల ప్రజల నుండి స్థానిక నాయకుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుంది. ఎవరైనా పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేయడానికి వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సదురు అధికారి తన పోలీస్ స్టేషన్ లో ఒక్క వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సదురు అధికారి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దళితుల పట్ల చిన్న చూపు చూస్తూ ఎవరైనా పిర్యాదు చేయడానికి వెళ్తే గెట్ అవుట్ అంటూ వారిని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్న తీరు వివాదాలకు నీలయంగా మారుతుంది. గోదావరిఖని ఓ పోలీస్ అధికారి తన ఇష్ఠారాజ్యంగా కొంత మంది కింది స్థాయి సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్న సదురు పోలీస్ అధికారి తీరుపై ప్రత్యేక కథనం.... పోరాటాల పురిటిగడ్డగా పేరు ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వివాదాలకు నిలయంగా మారుతున్నారు. దళితులను అవమానపరుస్తూ వారిని దూషిస్తున్నారని తమ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. సదురు సీఐ దళితులకు రాజ్యాంగంలోని హక్కులను కాలరాస్తున్నారు. కనీసం వారి ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించకుండా అవమాన[పరిచి పోలీస్ స్టేషన్ నుండి బయటకు పంపిస్తున్న సదురు సీఐ వ్యవహారశైలి ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో సదురు అధికారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన సంఘటనలు...
1 ) : స్వప్న అనే మహిళా బస్టాండ్ కాలనీలోని తన బంధువుల ఇంటి దగ్గర పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నా సమయంలో అర్ధరాత్రి అక్కడే ఉన్న సిపిఐ పార్టీకి చెందిన మడ్డి ఎల్లాగౌడ్ తో పాటు తన కుటుంభ సభ్యులు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మరుసటి రోజు సదురు సీఐ ఇంద్రసేనారెడ్డికి పిర్యాదు చేయగా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఈ విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లిన కూడా తనకు న్యాయం జరగకపోవడంతో వెంటనే హ్యూమన్ రైట్స్ ను ఆశ్రహించి దళిత సంఘాలతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసారు. ఒక్క మహిళా తన మీద దాడి జరిగిందని పిర్యాదు చేస్తే స్పందించకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన సిఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. 2 ) : కుటుంబ సమస్య నేపథ్యంలో ఇద్దరి కౌన్సిలింగ్ తర్వాత బయట మాట్లాడుకొమ్మని చెప్పడంతో సుమారు మధ్యాహ్నం 2గంటల సమయంలో సిఐ పోలీస్ స్టేషన్ కు వస్తున్న సమయంలో అక్కడే పక్కకు నిలుచొని ఉండగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న సిఐ పిలిచి నువ్వు ఎవడ్రా అని అని నా చెంపపై గట్టిగ కొట్టడంతో కొంతసేపటి వారికి అసలు ఎమ్ జరుగుతుందో కూడా అర్ధం కానీ పరిస్థితి కలిగిందన్నారు. దీంతో రెండు రోజులు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన సదురు సిఐ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 3) : సదానందం అనే కానిస్టేబుల్ బస్టాండ్ కాలనిలో ఇళ్లు కట్టుకున్నారు. అయితే సాంభశివరావు అనే సింగరేణి అధికారి అక్కడికి వచ్చి తన ఇంటి దారికి అడ్డంగా గోడ పెట్టారని ఇదేంటని అడిగినందుకు నన్ను కులం పేరుతో దూషించారని గత నెల 17వ తేదీన ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాను. ఇదే విషయంపై విచారణ చేపట్టిన అనంతరం మరుసటి రోజు సాక్షులను పోలీస్ స్టేషన్ కు తీసుకొని రా అని చెప్పడంతో అక్కడికి వెళ్లానని పోలీస్ స్టేషన్ లో సాక్షులతో సిఐ మాట్లాడుతూ భేదిరింపులకు గురి చేసారని సదానందం తెలిపారు. అలాగే అదే నెల 20 వ తేదీన ఏమైంది సార్ విచారణ చేపట్టి కూడా ఇంకా కేసు నమోదు చేయడం లేదని అడిగిన నన్ను నా భార్యను ఇష్టం వచ్చినట్లు సిఐ బూతులు తిడుతూ అవమాన పరిచారని నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎసిపి, సీపీకి, చెప్పుకుంటావా చెప్పుకో పో అంటూ అవమానించే విధంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడారని సదానందం ఆవేదన వ్యక్తం చేసారు. 4) : కోరే శంకర్ అనే సింగరేణి కార్మికుడికి తన ఇంటి దగ్గర ఉండే వారికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే శంకర్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన సీఐ ఇంద్రసేనారెడ్డి భాధితుల పక్షాన నిలవకుండా కోరే శంకర్ పైనే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని కానిస్టేబుల్ తో ఫోన్లు చేయించి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన శంకర్ తనపై అక్రమంగా కేసు నమోదు చేసి సీఐ ఇంద్రసేనారెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే దీనిపై దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల ఒక్కటవ పట్టణ సీ ఐ ఇంద్రసేనారెడ్డి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయనకు గోదావరిఖని ఏసీపీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారని అందుకే దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్యుడిపై చేయి చేసుకుని బూతుపురాణం మొదలుపెట్టిన సీఐ
సీఐ ఇంద్రాసేనారెడ్డి వచ్చే సమయంలో షాపు ముసివేయలేదని బూతుపురాణం మొదలు పెట్టి ఏకంగా కొబ్బరికాయలు అమ్ముకునే నిర్వాహకుడిపై చేయి చేసుకున్నాడు. అయితే రాత్రి 10 గంటలైనా షాపు మూసి వేయలేదని సీఐ తన ప్రతాపాన్ని చూపించాడు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రాత్రి 1:00 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, పాన్ షాపులు నడిచిన కనిపించడం లేదా అని ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బిర్యాని సెంటర్లు నడిస్తే, పాన్ షాపులు నడిస్తే తప్పు లేదు,పండుగ పూట దేవుడి పూజ సామాగ్రి అమ్ముకునే షాపు నడిస్తే తప్ప అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సామాన్యులపైనే సీఐ ఇంద్రసేనారెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా చేసిన సమయంలో ఓ యువకుడిని ఆకరణంగా బట్టలు విప్పి రోడ్డుపై కొట్టడంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది.. ఈ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోలీస్ స్టేషన్ ను సైతం ముట్టడించారు. దీంతో వెంటనే స్పందించిన అప్పటి ఉన్నతాధికారులు సదురు ఎస్సై పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఇన్ని ఘటనలు జరిగిన సదరు అధికారి తీరులో మార్పు రాకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...
Admin
Aakanksha News