Friday, 26 June 2026 01:25:59 AM

ధర్మారం మండలంలో కొండచిలువను చంపేసిన గ్రామస్తులు...

Date : 20 September 2025 03:29 PM Views : 471

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటన స్థానికులను కాసేపు భయాందోళనకు గురిచేసింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపాన తాత్కాలిక గుడిసెలలో నివాసముంటున్న ప్రజల వద్దకు కొండచిలువ ప్రవేశించింది.సమీప ప్రాంతం నుంచి వచ్చిన ఆ కొండచిలువ నేరుగా కోళ్ల గూటిలోకి వెళ్లి ఒక కోడిని మింగేసింది. ఆరుబయట కోళ్లు అరవడంతో మెలకువ వచ్చిన స్థానికులు పరిస్థితిని గమనించారు. గూటిలో భారీగా ఉన్న కొండచిలువను చూసి భయాందోళనకు గురైన వారు దానిపై దాడి చేశారు. ఈ క్రమంలో కొండచిలువ నోట్లో పట్టుకున్న కోడి బయటికి వదిలేసింది. అనంతరం ఆ కొండచిలువను పూర్తిగా చంపి దూరంగా పారవేశారు.ఆకస్మికంగా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :