Friday, 26 June 2026 01:26:10 AM

జీవితం మొత్తం దేశానికి అంకితం చేసిన మహనీయులు అటల్ బిహారి వాజ్ పాయ్ ..

ఎన్టీపీసీ మండలంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం... కందుల సంధ్యారాణి

Date : 26 December 2024 06:29 PM Views : 1265

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేసిన మహనీయులు అటల్ బిహారి వాజ్ పాయ్ అని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఈ సందర్బంగా భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పాయ్ శత జయంతిని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపిసి మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమనుభవ శిబిరంను నిర్వహించారు. పాఠశాల పరిసర ప్రాంతంలో వున్నా చెత్త, పిచ్చి మొక్కలను తీసివేసి పరిశుభ్రం చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా కందుల సంధ్యారాణి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హన్మంత్ గౌడ్ హాజరైయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గొప్ప రాజనీతజ్ఞుడు అంకిత భావంతో పని చేసిన నాయకులు, తను ప్రధానిగా వున్నప్పుడు ఎంతటి కఠిన సమస్య అయినా తన ఆలోచన విధానంతో పరిష్కారం చేసిన వ్యక్తిగా ప్రపంచ దేశాలలో మన్ననలు పొందారని అన్నారు. అజాత శత్రువుగా దేశాహితమే ద్యేయంగా వ్యక్తిత్వం కనబరిచిన మహోన్నత నాయకులు వాజ్ పాయి అని కొనియాడారు. పరిసరాల శుభ్రతతో మన మానసిక శుభ్రతా ముఖ్యమని తెలిపారని నేడు వారి స్ఫూర్తి తో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్చ భారత్ దేశంలో విజయవంతంగా నడుస్తుందని అన్నారు.తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలిచినా వ్యక్తి వాజ్ పాయ్ అని ఆయనను అందరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని అవంతరాలు ఎదురైనా పార్టీ పటిష్టతకు పని చేస్తూ బీజేపీని అజేయ శక్తిగా ప్రపంచంలోనే పెద్దపార్టీగా చేసారాన్నారు. దాని వెనుక వాజపేయ్, అద్వానీ లాంటి వారి కృషి ఏంతో వుందని తెలిపారు.వాజ్ పాయ్ తన రచనలతో ఎన్నో పుస్తకాలు రాసారని ఇప్పుడు ప్రాచుర్యంలో చాలా వున్నాయని వాటిని చదివి నేటి యువత స్ఫూర్తి పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి, కోమల మహేష్,తోట కుమారస్వామి,కొండపర్తి సంజీవ్, మండల అధ్యక్షలు కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, నాయకులు సిలివెరీ అంజి, తిరుపతి,సత్యనారాయణ,పల్లికొండ నర్సింగ్,ఇదునూరి చిరంజీవి,లింగస్వామి దామరకుంట గణేష్, పల్లికొండ భూమయ్య పల్లికొండ రమేష్, ఇదునూరి శ్రీకాంత్,కుందారపు నరేష్,కీసరి సాయి,వినయ్,మచ్చ విశ్వస్, చిరంజీవి, ఆకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :