ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని విఠల్‌నగర్‌లో పుట్టినరోజు వేడుకలో చోటుచేసుకున్న వివాదంతో యువకులు రోడ్డుపై దౌర్జన్యంగా ప్రవర్తించిన ఘటనపై గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. స్నేహితుడి జన్మదిన వేడుక సందర్భంగా మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగిన యువకులు, ఇంటి నుంచి గుంపుగా బయటికి వచ్చి రోడ్డుపై అనుచితంగా బూతులు తిడుతూ చిందులు వేయడంతో స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు, సంబంధిత యువకులను వారి తల్లిదండ్రులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. తమ పిల్లల భవిష్యత్ ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు బాధ్యత వహించేందుకు నిర్ధారించగా, యువకులను సత్ప్రవర్తన కోసం ఒక సంవత్సరం పాటు ఎలాంటి చెడు ప్రవర్తన చేయరాదని ఎంఆర్ఓ సమక్షంలో బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ... ప్రజా జీవనాన్ని భంగపెట్టే ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. చిన్న వయసులోనే నేర ప్రభావానికి లోను కాకుండా కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశనం చేస్తున్నాం అని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, వారి స్నేహితుల అలవాటులపై అవగాహన ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించిన సీఐ, పోలీసుల సేవలు ప్రజల రక్షణ కోసమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ ఎస్ఐ రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News