Friday, 26 June 2026 01:25:10 AM

సంబరాల పేరుతో ప్రజలను ఆగం చేస్తుండ్లు...

ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లేలా పరిపాలన సాగుతోంది.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

Date : 02 December 2024 01:48 PM Views : 463

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : సంబరాల పేరుతో ప్రజలను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ ప్రజా వంచన దినాల్లో బాగంగా సోమవారం రామగిరి మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రేవంత్‌ సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలం అయిందని, ఏ వర్గానికి మేలు చేయకుండా కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అయిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేలా 420 హమీలను తయారు చేసిన మంథని ఎమ్మెల్యే గతంలో ఐదు సార్లు మంథని ప్రజలను మోసం చేశారని, ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పేరుతో దగా చేసిన రేవంత్‌ సర్కార్‌ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటూ ముందస్తుగా రైతు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌ సర్కార్‌కే దక్కుతుందన్నారు. ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారని, యువకుల పేరుతో నిర్వహించే సభకు హజరు కానున్నారని, అయితే యువతకు, విద్యార్ధులకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. విద్యా భరోసా కింద ఐదు లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఐదు రూపాయాలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలిపెట్టలేదని, రైతులను, యువకులు, విద్యార్ధులను, మహిళలను, ఆడబిడ్డలను అందరిని పథకాల పేరుతు దగా చేశారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వాటికి సంబంధించిన ఆర్డర్‌ కాపీలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం పోయిందని, ఏడాదిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును తెలుసుకున్న ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీనే మాకు అండగా నిలుస్తుందని విశ్వాసంతో తమ వద్దకు వస్తున్నారని ఆయన అన్నారు. లీడర్లను నిలదీస్తనే పథకాలు అందుతాయనే బావన ప్రజల్లో మొదలైందని, ఇప్పటి వరకు చరిత్రలో జరుగని రీతిలో నిర్మల్‌, లగచర్ల సంఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయని, ఈ క్రమంలో కాంగ్రెస ప్రజావంచన దినాలను నిర్వహించడం జరుగుతోందని ఆయన ఈసందర్బంగా పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :