ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని జీఎం కార్యాలయం వద్ద “స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.0” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా యస్.ఓ.టు జీఎం ఎం.రామ్మోహన్ హాజరై స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ప్రతిజ్ఞాను చేయించారు.కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుండి 30 వరకు అక్టోబర్ 2 నుండి 31 అక్టోబర్ తేదీ వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. పని స్థలాల్లో పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కాలనీల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గాంధీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతిపిత స్పూర్తితో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ను విజయవంతం చేసి అర్జీ-1 ఏరియా ను ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు.మన పరిసరాలను మన పని స్థలాలను పరిశుభ్రంగా ఉంచినట్లైతే దేశం కూడా పరిశుభ్రంగా మారుతుందని, పరిశుభ్రత అనేది మనందరం మన దినచర్యలో భాగంగా పెట్టుకొని ముందుకు సాగాలన్నారు. అదే విధంగా మన చుట్టు ఉన్న వారికి కూడా ఈ స్వచ్ఛత గురించి అవగాహకు కల్పించాలని, పరిసరాలలో చెత్త చెదారం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏఐటియుసి జిఎం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, సిఏంఒఏఐ ప్రతినిధి క్రాంతి కుమార్, ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, ఫైనాన్స్ మేనేజర్ ఆడిట్ మోహన్ రావు, సీనియర్ పిఒ సారంగపాణి, హనుమంత రావు, శ్రావణ్ ఇతర అధికారులు పాల్గోన్నారు.
Admin
Aakanksha News