ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 23 సార్లు రక్తదానం చేసిన వ్యక్తికి “స్ఫూర్తి పురస్కార్”ను ప్రదానం చేశారు.ఈ పురస్కారాన్ని ఏనుగు నరసింహారెడ్డి (అడిషనల్ కలెక్టర్), కోట్ల వెంకటేశ్వర రెడ్డి (కాళోజి పురస్కార్ గ్రహీత), మరియు మండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన మధుకర్ వైద్యుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది.స్వీయ నిబద్ధతతో సేవా దృక్పథాన్ని ప్రదర్శించిన ఈ రక్తదాతకు అవార్డు అందిన సందర్భంలో అధికారులు, అతిథులు ప్రశంసలు గుప్పించారు.
Admin
Aakanksha News