ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ లో పని చేస్తున్న యాక్టింగ్ క్లర్క్ లకు క్లర్క్ లుగా ప్రమోషన్స్ ఇప్పించాలని కోరుతూ యాక్టింగ్ కర్ల్క్స్ బుధవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయుసి నాయకులు జిగురు రవీందర్, ఎల్.ప్రకాష్, అన్నారావు,సాంబశివ రావులకు వినతి పత్రం అందజేశారు.గత ఐదు సంవత్సరాలుగా యాక్టింగ్ క్లర్క్స్ గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్స్(క్లర్క్స్) గా పదోన్నతి కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. సమస్య పై ప్రత్యేక శ్రద్ధ వహించి యాజమాన్యంతో మాట్లాడి ప్రమోషన్స్ ఇప్పించే విధంగా కృషి చేస్తామని నాయకులు హామి ఇచ్చారు. వినతి పత్రం అందించిన వారిలో మహేందర్,లోకేష్ విక్రమ్, సమత, కావ్య, జయ, దేవేందర్, కె.తిరుపతి, రాంసాగర్, ఈ.తిరుపతి,సంతోష్, సిరాజ్ తదితరులు ఉన్నారు.
Admin
Aakanksha News