Tuesday, 11 August 2026 07:51:20 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు గాయాలు

స్కూటీని డీ కొట్టిన లారీ

Date : 10 June 2025 10:55 AM Views : 619

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులపై ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో వారు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...పెద్దపల్లి పట్టణానికి చెందిన ఓమసియా, భోజన్నపేటకు చెందిన అక్షయ అనే ఇద్దరు విద్యార్థినులు ట్రినిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం కాలేజీకి స్కూటీపై వెళ్తుండగా పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రధాన రహదారిలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :