Saturday, 26 September 2026 04:09:13 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన సీఐ అసిస్టెంట్ రైటర్ పి. రాజమౌళి..

సిల్వర్, గోల్డ్ మెడల్ సాధించిన అసిస్టెంట్ రైటర్ ను అభినందించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి...

Date : 03 February 2025 01:52 PM Views : 633

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జూన్ 3 కరీంనగర్20 25 స్టేట్ లెవెల్ ఈత పోటీల్లో 200 మీటర్ల స్విమ్మింగ్ పోటీలో సిల్వర్ మెడల్ తో పాటు, 100 మీటర్ల స్విమ్మింగ్ పోటీలో గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ అసిస్టెంట్ రైటర్ పి రాజమౌళి సిల్వర్ మెడల్ తో పాటు గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోలీస్ శాఖ నిర్వహించడం ఇందులో రాష్ట్ర స్థాయిలోని అన్ని జోన్లకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. కరీంనగర్ జోన్ జోన్ 3 నిర్వహించిన ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ సాధించిన రాజమౌళిని గోదావరిఖని ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో పాటు పోలీస్ అధికారులు తోటి పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖ నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో గోదావరిఖని ఒకటో పట్టణ మోడల్ పోలీస్ స్టేషన్ నుంచి సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :