ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : జాతీయ సేవా పథకం ( ఎన్ ఎస్ ఎస్ ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పీ ఓ ఎల్ ఆర్ కే రెడ్డి, అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుమల్ , శ్రీదేవీ, దీపరాణి, కొమరయ్య, సిబ్బంది రాజన్న, బియ్యబని, అనసుర్య, ప్రభాకర్ లు పాల్గోన్నారు.
Admin
Aakanksha News