ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఈ నగరానికి రావాలంటేనే భయం.... కార్లలో వచ్చేవారు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి... ద్విచక్ర వాహనా దారులు రోడ్ల మార్జిన్లలో ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తారు. ప్రైవేటు వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, బడబడ షాపింగ్ నిర్వాహకులు కనీసం పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తూ రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తూ దర్శనమిస్తుంటారు. నగరంలోని మోతాదుమించి ఆటోలు, ప్రైవేట్ బస్సులు సరకు రవాణా చేసే వాహనాలు తిరుగుతున్న పట్టించుకోరు. ఉదయం సాయంత్రం వేళ ప్రధాన కూడళ్ళలో కేసులు రాసే ట్రాఫిక్ సిబ్బంది రాకపోకలకు ఆటంకం కలిగించే అంశాలపై దృష్టి సారించారు.రామగుండం నగర పాలక సంస్థలో అస్తవ్యస్తమైన రోడ్లు, ఇష్ట రాజ్యాంగా తవ్వకాలు, ఎవరికివారు రోడ్ల ఆక్రమణ, మరోవైపు ఏ వీధిలో చూసిన తినుబండారాల బండ్లు ఇందుకోసం వచ్చేవారు రోడ్లపై అడ్డంగా వాహనాలను నిలిపివేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. రామగుండం ట్రాఫిక్ పై ఆకాంక్ష ప్రత్యేక కథనం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ట్రాఫిక్ ప్రణాళిక లేకపోవడం వాహనదారులకు పెద్ద శాపంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయకపోవడం ఈ కష్టాలకు కారణం అవుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గాలు మారుతున్న నగరంలో అంతకంతకు ట్రాఫిక్ సమస్య జాఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పలువురు వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖని కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్, ఓల్డ్ అశోక్, స్వతంత్రచోక్, రిగల్ వంటి ఏరియాలలో ప్రధాన ఆసుపత్రులు ఎన్నో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తుల కారణం ఒకటైతే, అస్తవ్యస్తంగా ఆటోల పార్కింగ్, ద్విచక్ర వాహనాల నిలిపివేతతో ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఎమర్జెన్సీ అంబులెన్సులకు తీవ్ర ఇబ్బందిగా ట్రాఫిక్ మారుతుంది.దాదాపు మూడు లక్షల జనాభా కలిగిన ఈ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సరుకు రవాణా చేసే లారీలు ఇతర వాహనాలు ప్రైవేట్ బస్సులు మోతాదుకు మించి ఆటోలు, బయట ఊళ్లో నుంచి వచ్చి కిరాయి వాహనాలు, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా ఇష్టారాజ్యము తిరగడం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారుతుంది. చిత్తశుద్ధి ఉంటే చక్కదిద్దడం పెద్ద విశేషం కాదన్న చందంగా రామగుండం దగ్గర పాలక సంస్థ పరిస్థితి తయారయింది అని పలువురు విమర్శిస్తున్నారు.
వ్యాపార సముదాయాల భారీ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు...⁉️
వ్యాపార సముదాయాలకు సంబంధించిన భారీ వాహనాలు ప్రవేశించడానికి ఒక నిర్దిష్ట సమయం లేకపోవడం కొందరు వ్యాపార నిర్వహకులు, బడవ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా అడ్డువదుపు లేకుండా భారీ వాహనాలను ఎప్పుడు పడితే అప్పుడు లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ లలో వ్యాపార సముదాయాల ముందు రోడ్డుపైనే వాహనాలను నిలిపి సరుకులను దించడం అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం, ట్రాఫిక్ యంత్రాంగం ఉల్లంఘనల కేసులు రాయటానికి ఎక్కువగా ప్రాధాన్యత మించి అసలు విషయాన్ని వదిలేయడం టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు,వంటివి ప్రధాన రహదారులను ఆక్రమించడం పెట్టుకోవడం కూరగాయలు పండ్ల విక్రయాలను ప్రత్యేకంగా జోన్లు ఏర్పాటు చేయకపోవడం ఇబ్బందులను కలిగిస్తుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలు ఏవి....⁉️
పార్కింగ్ చేయడానికి వచ్చేవారు తమ వాహనాలను నిలుపుకోవడానికి ప్రధాన వర్తక, వాణిజ్య కేంద్రాల్లో నిర్దేశిత పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు ఒక్కటి కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో షాపుల ఎదురుగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రహదారుల వెంబడి వాహనాలు నిలిపివేయడం వంటి సమస్యకు కారణమవుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్ వంటి ప్రధాన వ్యాపార కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల వేసి ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం, వ్యాపార సముదాయాల్లో వాహనాలను ఇష్ట రాజ్యాంగా పార్కింగ్ చేయడం, తమ ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆటోలో నిలిపివేయడం వల్ల ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగడంతో పాటు రామగుండంలో ట్రాఫిక్ సుడిగుండంలా తయారవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు నగరపాలక సంస్థ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
Admin
Aakanksha News