Friday, 25 September 2026 04:19:05 AM

విద్యార్థుల చదువు ఒకటే కాదు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం...

పాఠశాల చైర్మన్ మంజుల శ్రీనివాస్ రెడ్డి

Date : 15 February 2025 06:20 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు సమతుల్య, పోషకాహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. పిల్లలు జంక్‌ఫుడ్‌, చిప్స్‌ తిన్నంత ఇష్టంగా.. హెల్తీ ఫుడ్‌ను ఇష్టపడరు. ఆ చిరుతిండ్లతోనే పిల్లలు కడుపు నింపుకుంటారు. దీని వల్ల వారు పోషకాహార లోపానికి గురవుతూ ఉంటారు. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి.. ఇన్ఫెక్షన్లకు, అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు.ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలు వేగంగా ఎదుగుతారు. పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా పిల్లల అభ్యాసం, జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సంపూర్ణ, ఆరోగ్యకరమైన ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడుకు మంచి పోషకాలను అందించి.. ఒత్తిడి, ఆందోళనను తొలగిస్తాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.అయితే పాఠశాలలో చదువు ఒక్కటే కాదు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆటపాటల్లోనే కాదు, విద్య ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అంటూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పాఠశాలలో స్కూల్ క్లినిక్ పేరుతో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.పాఠశాల చైర్మన్ మంజుల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి రిపోర్టులను అందజేశారు. అలాగే విద్యార్థులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం చేయాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. ప్రతి రోజు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రామకృష్ణ, సత్యనారాయణ, శైలజ, రాజిరెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :