ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పోలీస్ శాఖలో పని చేస్తున్న తన ఆత్మ మిత్రులు పదవి విరమణ పొందిన సందర్భంగా గతంలో పోలీస్ శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన స్నేహితులు ఘనంగా సత్కరించారు. రామగుండం కమిషనరేట్ లో ఏఆర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని బెల్లంపల్లి నుంచి గోదావరిఖనికి వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమై శాంతి తనకు తానే సాటిగా నిలిచిన తన మిత్రుడు ఏఆర్ ఏసీపీ సుందర్ రావుకి ఏఆర్ రిటైర్డ్ ఏఎస్ఐ పులిగంటి సూర్యనారాయణ రెడ్డి, గోదావరిఖని ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బొజ్జ సురేందర్ లు ఘనంగా సన్మానం నిర్వహించారు. పదవి విరమణ తర్వాత వారిని పూలమాలతో కుటుంబ సమేతంగా సత్కరించారు
Admin
Aakanksha News