Saturday, 07 December 2024 03:10:34 PM

ముళ్ళ కంచెల్లో మూడుముళ్ల బంధం...

వివాహేతర సంబంధాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు.... నేర ఘటనలుగా మారుతున్న అక్రమ సంబంధాలు...

Date : 09 November 2024 07:27 AM Views : 4582

ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని : వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నభిన్నం చేసి నాశనం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. దీనిపై "ఆకాంక్ష న్యూస్" ప్రత్యేక కథనం...కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తలవంచుతుంది. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై ఉన్న గౌరవం, సామాజిక అంశాలు ఇందుకు కారణం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే ఈసడించుకునే పరిస్థితి పోయి ఇప్పుడు మనం కూడా అదేదారిలో నడిచేందుకు ఇష్టపడుతున్నామన్న భావన క్రమేపీ బలపడుతోంది.పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు.. ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్న ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారి ఆందోళనకు కారణమవుతోంది. అదే సమయంలో కొందరు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా కొందరు భర్త ఉండగా, పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం. లేదా భార్య ఉండగా భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం గల కారణాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అయితే దంపతుల్లో చాలా మందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. ఈ విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై కొన్ని చివరికి నేర సంఘటనలుగా మారుతుండగా మరి కొన్ని విడాకులకు దారితీస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల విషయంలో కొందరు ఎందాకైనా తెగిస్తుండటం, చివరికి కన్నపిల్లల్ని, సొంత కుటుంబీకులనూ బలి చేయడానికి పూనుకోవడం సర్వ సాధారణంగా మారింది.అయితే ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండటం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్‌ పీరియడ్‌గా చెప్పుకునే సంవత్సరంలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం. అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఏ స్త్రీ తన భర్త చేసిన ద్రోహాన్ని సహించదు. అలాగే ఏ పురుషుడు తన భార్య పరాయివాడితో చనువుగా ఉండటాన్ని భరించలేడు. వారితో ఇక కొనసాగడం కష్టంగా ఉంటుంది. మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మనసును గాయపరుస్తుంది. ఇది ఇద్దరు విడిపోయేలా, మరింతగా చెడిపోయేలా, తమ చేజేతులా జీవితం నాశనం చేసుకునే వరకు వెళ్తుంది. కానీ, ఈ కారణం ఏ పాపం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు. ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాల ఘటనలుగా చోటు చేసుకుంటున్నాయి.

అక్రమ సంబంధాలతో చిన్నభిన్నం అవుతున్న కుటుంబాలు....

సమాజంలో మహిళలు ఎన్నో కట్టుబాట్ల నడుమ పెరుగుతారు. అయిన కూడా సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ, మార్పుల కారణాల వల్లనో లేక వారి సవాసాలు, వారి అలవాట్లలోనో మార్పులు రావడంతో ఇటువంటి పరిస్థితులకు దారి తీసి భార్య, భర్తల మధ్య దురాన్ని పెంచి కుటుంబ బంధం చిన్నభిన్నానికి కారణం అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లయ్యాక కూడా అక్రమ సంబంధం కలిగి ఉండటానికి కారణాలేమిటి? పలువురు చేసిన సర్వేల్లో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :