ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఈ నేల 9వ తేదీన అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీలో జరిగిన కార్యక్రమంలో బొంకురి మధు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని జాతీయ మాల మహానాడు, తెలంగాణ మాల మహానాడు సంఘాల నాయకులు శ్రీహరి మద్దెల శ్రీనివాస్ లు హెచ్చరించారు. ఈ సందర్బంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.... చౌరస్తాలో ఆఫీసులు ఏర్పాటు చేసుకొని కొందరు సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తున్నారని మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ప్రారంభం నుండి ఎవరు అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు అని అన్నారు. మేము భవన నిర్మాణ కమిటీ పేరుతో చందాలు వసూల్లు చేయలేదని ఘాటుగా విమర్శించారు. బొంకురి మధు అంబేద్కర్ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఏలా అయితే బొంకురి మధు మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారో మళ్లీ మీడియా సమావేశం పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గడ్డం నారాయణ, పిట్టల వెంకటి, నంది నాగేశ్వరావు, మొండయ్య, లింగమూర్తి, రామస్వామి, రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News