Tuesday, 11 August 2026 03:50:06 PM

అందిన కాడికి దండుకోవడమే ఈయన పని....

గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన ఎడీఈ అక్రమాస్తులు మరెన్నో...

Date : 16 February 2025 10:30 AM Views : 626

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : హైదరాబాద్ గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడిఈ కొట్టె సతీష్ 70 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే... అయితే గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన సతీష్ ఇక్కడే పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయితే ఇప్పటికే 100కోట్ల అవినీతి అక్రమాస్తులు బయటపడడంతో ఏసీబీ అధికారులు అవ్వక్కయ్యారు. అయితే హైదరాబాదులోనే కాకుండా గోదావరిఖనితో పాటు పలు చోట్ల బినామీల పేరుతో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉండడంతో అక్రమస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, నగలను తన బినామీలతో గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :