Sunday, 27 September 2026 04:11:13 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం...జిమ్మిబాబు...

Date : 21 March 2025 05:38 PM Views : 485

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని, నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు జిమ్మి బాబు అన్నారు. సందర్భంగా రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ చేపడుతున్న గోదావరి గోస మహా పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. బెజ్జంకి నుండి ప్రారంభమైన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిమ్మి బాబు మాట్లాడుతూ... కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎంతోమంది రైతుల్లో ఆనందం వెల్లువెరిసిందని అన్నారు. లక్షల ఎకరాల్లో పంట పొలాలకు నీరు అందించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అలాగే మేడిగడ్డలో కుంగిన పిల్లర్లకు మరమ్మత్తులు చేయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా చూడాలన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :