Friday, 26 June 2026 01:14:47 AM

రైతుల ముఖాల్లో చిరునవ్వే మాకు ముఖ్యం... గతంలో పాలకులు కటింగ్ ల పేరిట రైతులను దోచుక తిన్నారు...

సన్న వడ్లకు బోనస్ అందించడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్... పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు...

Date : 18 April 2025 05:54 PM Views : 491

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రైతుల ముఖాల్లో చిరునవ్వే మాకు ముఖ్యం అని, గత పాలకులు కటింగ్ ల పేరిట రైతులను దోచుక తిన్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. ఈ మేరకు సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లె, గొల్లపల్లి, సాంబయ్య పల్లి, ఐతరాజపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో శుక్రవారం సింగిల్ విండో, ఐకెపి ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ...ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. తాము పూర్తి పారదర్శకంగా రైతులకు న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. అధికారంలో లేనప్పుడు వడ్ల కటింగ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఎమ్మెల్యేగా గెలిచినాక మాటకు కట్టుబడి ఎక్కడ కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు జరుపుతున్నామని అన్నారు. అలాగే సెంటర్ లోకి ధాన్యం తీసుకువచ్చి తక్ పట్టీలను పొంది రైతులు నిరంధిగా ఉండవచ్చని, 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సారి కూడా సన్న వడ్లకు బోనస్ అందిస్తామన్నారు. గత సీజన్ లో సన్న వడ్ల బోనస్ రాష్ట్ర మొత్తం మీద ప్రభుత్వం రైతులకు 1234 కోట్ల రూపాయలు అందించగా, అందులో ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా 59 కోట్ల 15 లక్షల రూపాయల బోనస్ ను రైతులు పొందారని చెప్పారు. అకాల వర్షాల వల్ల దురదృష్టవశాత్తు పంటలకు నష్టం జరిగితే రైతులు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.దెబ్బతిన్న వడ్లను కూడా కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లకు గాను రూ.1.52 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు,కోన విన మల్ల రెడ్డి, శ్రీగిరి శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్,దానాయక్ దామోదర్ రావు, డిపిఎం నాగేశ్వర్ రావు, ఏపిఎం లు, అధికారులు కాంగ్రెస్ నాయకులు పన్నాల రాములు, కళ్ళేపల్లి జానీ, తిరుమల్ రావు, గుజ్జెట్టి వెంకన్న, బండారి రమేష్, బక్కయ్య, రాజి రెడ్డి, తిరుపతి రెడ్డి, పులి వెంకటేషం, బొజ్జ అజయ్, చంద్రయ్య,మురళి,విజేందర్, ఆర్నకొండ సాగర్, గడ్డం అనిల్, పోచంపల్లి రాజు, రమేష్, సతీష్, సంపత్ రావు, రాజు, సందీప్, చక్రధర్, సతీష్, రాజన్న, శ్రీనివాస్ రావు మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :