ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గోదావరిఖని పట్టణానికి చెందిన చక్రి, శ్యామ్ లు ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుండి గోదావరిఖని తరలి వస్తుండగా, అప్పన్నపేట సమీపంలో గుర్తు తెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో చక్రి, శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ పరిశీలన చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుర్తు తెలియని వాహనాన్ని పట్టుకునేందుకు సీసీటీవీ పుటేజీల ఆధారంగా వెతుకులాట చేపట్టినట్లు సమాచారం.
Admin
Aakanksha News