Saturday, 26 September 2026 04:36:39 AM

కొట్టిన వాటికే కొబ్బరికాయలు కొట్టి డప్పు కొట్టుకుంటున్నారు... బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు

నీవు ఏమి దందాలు చేస్తున్నావో మీ ఎమ్మెల్యేకి ఎందుకు అర్థం కావడం లేదు...

Date : 24 March 2025 11:53 AM Views : 631

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గత ప్రభుత్వ హాయంలో వచ్చిన నిధులతో కొట్టిన వాటికే మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు కొట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, గాధం విజయ లు ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... మహంకాళి స్వామి అనే నువ్వు రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిచినందుకే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి నీది కాదని హెచ్చరించారు. వందలాది మంది కార్యకర్తలతో మండుటెండలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి నీటి గోస పేరుతో పాదయాత్ర నిర్వహిస్తే అవహేళన చేసి మాట్లాడడం నీ అహంకారానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. గోదావరికి నీరును విడిస్తే ఎక్కడ మీ ఇసుక దందా పోతుందో అని అందుకే నీళ్లు విడవడం లేదా అని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో నీవు ఏమి దందాలు చేస్తున్నావో అసలు మీ ఎమ్మెల్యేకు ఎందుకు అర్థం కావడం లేదని, నీవే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నావని విమర్శలు చేసారు. ఇచ్చిన హామీలపై దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చేతులెత్తేసారన్నారు. ఒకసారి ప్రజల్లోకి వెళ్లి చూస్తే ఈ మాట దగ్గర జరుగుతున్నటువంటి మీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :