ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన పెంచుదాం సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో తెలంగాణ అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. మంథని ఫైర్ స్టేషన్లో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభంకాగా వారోత్సవాల పోస్టర్ ను మంథని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న బాంబే పోర్టులో విక్టోరియా పేరిట జరిగిన భారీ పడవ అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారన్నారు. అప్పటి నుంచి ఆ ప్రమాదంలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ జె శివ శంకర వర ప్రసాద్, లీడింగ్ ఫైర్ మాన్ ఎన్ దేవేందర్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News