Friday, 26 June 2026 12:17:15 AM

జీతాలు లేక ఇబ్బంది పడుతున్నాం ..

వినతిపత్రం సమర్పించిన పార్ట్ టైం ఉపాధ్యాయులు

Date : 26 September 2024 01:38 PM Views : 355

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : గత రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని మంథని పట్టణానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల పార్ట్ టైం ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ శ్రీనాథ్ కు వినతిపత్రం సమర్పించారు. ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి తమకు న్యాయం చేయవలసిందిగా వారు వేడుకున్నారు. రాష్ట్ర మొత్తం గత కొన్ని పాఠశాలలో మూడు నెలలు, మరి కొన్ని పాఠశాలలో రెండు నెలలుగా పార్ట్ టైం ఉపాధ్యాయులకు జీతాలు లేక వారి కుటుంబాలు అగమ్య గోచరంగా ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా పార్ట్ టైం టీచర్లకు జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని వారు వినతిపత్రంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్ట్ టైం ఉపాధ్యాయులు పున్నం, అరవింద్, రమేష్, శ్రావణ్ కుమార్, రాజేష్, రమేష్, రాజమౌళి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, అనిత, లింగయ్య, ఆనంద్, రవీందర్, కార్తీక్, సడవలి, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :