Sunday, 27 September 2026 05:25:55 AM

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి...జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్.

మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ద కార్మికులకు కనీస వేతనాలు అమలు చెయ్యాలి..

Date : 18 December 2024 05:33 PM Views : 522

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్షలను పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, బిఆర్ఎస్. అనుబంధ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మురళీధర్ రావు దీక్షను ప్రారంభించారు. ఇందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు ఉదయం 5 గంటల నుంచి కార్యాలయం ముందు నిరసన దీక్షను చేపట్టారు.అనంతరం కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆ హామీల ఊసే లేదని అన్నారు. 2వ పి.ఆర్.సి. ప్రకారం నెలకు 26 వేల రూపాయలు వేతనం ఇవ్వాలి.కానీ అది అమలు చేయడం లేదన్నారు. అది అమలు చేసే వరకు కనీసం ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నట్లు నెలకు 21 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 11వ పి.ఆర్.సి.ప్రకారం కేటగిరీల ఆధారంగా నెలకు 19వేల రూపాయల నుండి 30, 040 రూపాయల వరకు వేతనం నిర్ణయించారని అన్నారు. అదికూడా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అది కూడా కార్మికులకు అందని ద్రాక్షగా మిగిలిందని అన్నారు. కార్మికులకు సంవత్సరానికి 15 సెలవులు ఇవ్వాల్సి ఉండగా అవి కూడా ఇవ్వడం లేదని అన్నారు.దీంతోపాటు కార్మికులకు రక్షణ పరికరాలు కానీ, చీపుర్లు,బెల్లం తదితర ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని అన్నారు.ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కార్మికులు తమ జీవితాలను పణంగా పెట్టీ ప్రజలకు సేవ చేస్తున్నారనీ అన్నారు.ఇలాంటి వారికి వేతనాలు పెంచి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు,అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. రామగుండం నియోజక వర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మాట్లాడడం జరిగిందని అందుకు తనకు ధన్యవాదాలు తెలిపారు.. అదే చొరవతో వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కార్మికులకు వెన్నంటి ఉండాలని కోరారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని అన్నారు.అనంతరం రామగుండం ఇంచార్జి కమీషనర్ అరుణ శ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.నాగమణి,కిషన్ నాయక్, రాదా కృష్ణ, ఈ.రాజమల్లు,శేకర్, సంతోష్,శోబన్,సారయ్య,స్వరూప,సునీత,శారద, రాణి,అంజయ్య,రూప,పద్మ, లత, రాజేందర్, మల్లమ్మ,రవి,చెంద్రయ్య,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :