Monday, 10 August 2026 04:14:16 PM

తప్పుడు కేసులు నమోదు చేసిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి..

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ కు వినతిపత్రం

Date : 07 March 2025 03:21 PM Views : 662

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తప్పుడు కేసులు నమోదు చేసిన నస్పూర్ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రె చక్రవర్తి వినతి పత్రాన్ని అందజేశారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో నస్పూర్ సీసీసీ ఎస్.ఐ నా పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమంగా మూడు తప్పుడు కేసులు నమోదు చేసి నా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. నాకు సీసీసీ ఎస్.ఐ నుండి ప్రాణ హాని ఉందని నాకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం పై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు స్పందిస్తూ రామగుండం సీపీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని తెలియజేసినట్లు కర్రె చక్రవర్తి తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :