Tuesday, 11 August 2026 02:52:16 PM

అయ్యప్ప దేవాలయంలో గణపతి హోమం...

Date : 08 November 2024 02:23 PM Views : 558

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కోదండ రామాలయంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప దేవాలయ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి నేతృత్వంలో గురు స్వామి హనుమంతరావు ఆధ్వర్యంలో మండల పూజా కార్యక్రమంలో భాగంగా ఘనంగా గణపతి హోమం జరిపారు. అనంతరం భక్తులకు భిక్ష అన్నదానం నిర్వహించారు. అయ్యప్ప దేవాలయంను ఘనంగా పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.రామాలయ శివాలయ అయ్యప్ప ఆలయాల పూజారులు శశిధరచార్యులు,చంద్రశేఖర శర్మ,రామకృష్ణ శర్మ తో పాటు అయ్యప్ప స్వామిమాలదారులు దేశెట్టి శ్రీనివాస పటేల్, చాతబోయిన శ్రీనివాస్, యాదవ్, సనత్ కుమార్,రవి లతో పాటు అధిక సంఖ్యలో , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :